నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
నెంబర్ ప్లేట్ లేని వాహనాల పై రెండు నెలలుగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు భువనగిరి పట్టణ సిఐ కే సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని వినాయక చౌరస్తా వద్ద నిర్వహించిన తనిఖీలు నెంబర్ ప్లేట్ సరిగా లేని 12 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో చైన్ స్నాకింగ్ లు జరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో టౌన్ ఎస్ఐ నాగరాజు, ఏఎస్ఐ వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, కానిస్టేబుల్ చంద్రశేఖర్, వినోదు శ్రీనివాస్, శ్రీనివాస్ , సంజీవ, సిబ్బంది పాల్గొన్నారు.