
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైనట్లు స్థానిక ఎస్సై ఈ.రతీష్ శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మర్కోడు గ్రామంలో ఇద్దరు వ్యక్తులు గత శుక్రవారం ఓ వివాహిత వరి పంట చేను వద్ద పనిచేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సొంత పొలం పనికి వచ్చి, మరొకరు పచ్చగడ్డి కోసుకోని పోవడానికి వచ్చిన క్రమంలో ఇద్దరు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. దాంతో బాధితురాలు వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల సహకారంతో ఆళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు అయిన వారిలో ప్రధాన ముద్దాయి వరుసకు అన్న కాగా, మరో వ్యక్తి బావ అవుతారని, బాధిత కుటుంబ సభ్యులు పాత కక్ష్యల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా మాపై కేసు పెట్టారు తప్పా మరోటి లేదని దోషులు ఆరోపిస్తున్నారు.