నాలేశ్వర్ వీడీసీపై కేసు నమోదు..

నవతెలంగాణ – నవీపేట్
ఇసుక తరలింపు విషయమై సోమవారం రెవెన్యూ పోలీసు అధికారులను నాళేశ్వర్ వీడిసి సభ్యులు అడ్డుకోవడం, దౌర్జన్యం చేసిన సందర్భంగా సిపి కల్మేశ్వర్ ఆదేశాల మేరకు మంగళవారం కేసులు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. తహసిల్దార్ నారాయణ అనుమతుల మేరకు నాలేశ్వర్ ఇసుక పాయింటు నుండి మూడు ఇసుక ట్రాక్టర్లు బినోల గ్రామానికి తరలిస్తుండగా నాలేశ్వర్ వీడిసి సభ్యులు ట్రాక్టర్లను అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో సంఘటన స్థలానికి రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లి సముదాయించిన ట్రాక్టర్లను వదలకపోవడంతో తహసిల్దార్ నారాయణ ఫిర్యాదు మేరకు నాలేశ్వర్ వీడీసీ సభ్యులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ మంగళవారం తెలిపారు. వి డి సి సభ్యులు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.