భార్య పై దాడికి పాల్పడిన భర్త పై కేసు నమోదు

నవతెలంగాణ – అశ్వారావుపేట

భార్య పై భర్త తో పాటు కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన సంఘటన లో కేసు నమోదు అయింది. బాధితురాలు పొంది రమాదేవి రాతపూర్వక ఫిర్యాదు మేరకు ఎస్.ఐ శివరాం క్రిష్ణ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని కోయ రంగాపురం పంచాయితీ ఖమ్మం పాడు కు చెందిన గొంది లక్ష్ముడు – రమాదేవి కి ఇరవై ఏండ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇరువురు సంతానం ఉన్నారు. ఈ భార్యాభర్తలు గత కొంత కాలం మనస్పర్ధలు తో సతమతం అవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేది శుక్రవారం రమాదేవి పై భర్త లక్ష్ముడు కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన భౌతికంగా హింసించారు. ఆమె పిర్యాదు మేరకు ఆదివారం భర్త , మరో అయిదు గురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ శివరాం క్రిష్ణ తెలిపారు.