హరితహారంలో నాటిన చెట్లను నరికిన వ్యక్తిపై కేసు నమోదు

నవతెలంగాణ – ఆర్మూర్ 

ఆలూర్ మండలంలోని మిర్జాపల్లి వెళ్లే దారిలో  హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కలను ఏలేటి గంగారెడ్డి కొట్టివేయడం జరిగిందని, దీంతో ఫారెస్ట్ అధికారులు  శనివారం వారిపై కేసు నమోదు చేసి  వారికి 23760/- రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామ ప్రత్యేకాధికారి,పంచాయతీ కార్యదర్శి రాజలింగం ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.