– 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్మోహన్ బుధవారం తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఎస్సై రామ్మోహన్ మాట్లాడుతూ… ఉమెన్స్ సేఫ్టీ లో భాగంగా బుదవారం రాత్రి బ్లూ కోర్టు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు.రామన్నపల్లి గ్రామానికి వెళ్లగా అక్కడ ఐకెపి సెంటర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా మద్యం సేవిస్తుండగా బ్లూ కోర్టు సిబ్బంది అక్కడికి వెళ్లి వారు వివరాలను అడిగారన్నారు .అందులో ఉన్న గుండీ ప్రశాంత్ అనే వ్యక్తి పోలీసు సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి పోలీసులను చేతులతో నెట్టివేస్తూ వారి విధులకు ఆటంకం కలిగించినట్లు తెలిపారు. బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ ప్రశాంత్ గురువారం ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా సిరిసిల్ల జడ్జ్ ప్రశాంత్ కు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా ప్రశాంతును కరీంనగర్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.