చంపుతానని బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

నవతెలంగాణ – రేవల్లి
గోపాల్ పేట్ అనంతపురం గ్రామానికి చెందిన దవడ పర్వతాలు తండ్రి పేరు కృష్ణయ్య, వయసు 45 సంవత్సరాలు అనే వ్యక్తి, ఈరోజు ఉదయం,  సుమారు 9 గంటల సమయంలో పొలం దగ్గర నుంచి ఇంటికి వెళుతుండగా మధ్యలో అడ్డగించిన, అదే గ్రామానికి చెందిన ” కాటమొని బాలరాజు ” అనే వ్యక్తి, పాత కక్షలు మనసులో పెట్టుకొని చేతులతో కొట్టి చంపుతానని బెదిరించగా, బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, గోపాల్ పేట్ మండల ఎస్సై వెంకటేశ్వర్లు  తెలియజేశారు.