ఉపాధ్యాయుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకంగా మారాడు.  అభం శుభం తెలియని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలంలోని జప్తి జానకంపల్లి లో గల ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజు షీ టీమ్ ఆధ్వర్యంలో గుడ్ టచ్ బాడ్ టచ్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు.  విద్యార్థులు ఉపాధ్యాయుడు తమ పట్ల ప్రవర్తిస్తున్న తీరును షీ టీంకు వివరించారు తద్వారా విషయం బయటకు వచ్చింది. జాన్కంపల్లి గ్రామానికి చేరుకున్న డీఎస్పీ శ్రీనివాస్ విచారణ నిర్వహించగా కీచక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తున్న ప్రవర్తన అసభ్యంగా ఉండటంతో ఉపాధ్యాయుడి పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.ఎస్.పి శ్రీనివాస్ తెలిపారు. ఆయన వెంట ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్. ఎస్సై రాజు ఉన్నారు.