భూమి చదును అడ్డుకున్న వారిపై కేసు నమోదు..

నవతెలంగాణ నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేటలో 508 సర్వే నెంబర్లు భూమి చదును చేస్తున్న వారిని అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. గోపాల్ పేట్ కు చెందిన చకిలం ప్రవీణ్ దగ్గర నుండి హైదరాబాద్ కు చెందిన మహేందర్ 2022లో 4 గుంటల భూమి ని కొనుగోలు చేయడం జరిగింది. మంగళవారం రోజు ఆ భూమి చదును చేస్తుండగా గోపాల్పేట్ కు చెందిన షాయద్ పాషా అతని తమ్ముడు బిలాల్ అతని అమ్మ అడ్డుకోవడం జరిగిందని ఈ విషయంపై మహేందర్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో భూమి చదును అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజు తెలిపారు.