నవతెలంగాణ- కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫూలాంగ్ కు చెందిన ఖలీద్ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ సోమవారం తెలిపారు. ఖలీద్ ఇచ్చిన దరఖాస్తు మేరకు అతని తండ్రి ఖాసిం న్యాయవాది కి సంబంధించిన ఒక షట్టర్ రూమ్ ఖిలా రోడ్ కి కలదు. అట్టి షట్టర్ రూమ్ ని తమకు అమ్మాలని అర్షద్ ఖాన్, ముజఫర్ ఖాన్, ముజాహిద్ ఖాన్, ఈ ముగ్గురు చాలా రోజుల నుంచి అతనిని అడగడం జరిగింది. అయితే ఆదివారం రాత్రి అందాజ 9 గంటల ప్రాంతంలో అర్షద్ ఖాన్, అతని ఇద్దరు కొడుకులు ఖాసిం న్యాయవాది తన షట్టర్లో ఉండగా అతని దగ్గరికి వెళ్లి అతనితో వాగ్వాదం చేస్తూ అతన్ని ఈ షెటర్ మాకు అమ్మి ఇక్కడి నుండి వెళ్లిపోవాలి అని గొడవ చేయడమే కాకుండా కొట్టడం జరిగిందన్నారు. ఈ గొడవపై ఖాసిం న్యాయవాది కొడుకు అయిన ఖలీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు