లిక్కర్ ను తరలిస్తున్న ఆటో పట్టివేత.. కేసు నమోదు

నవతెలంగాణ- ఆర్మూర్: ఆలూరు దేగాం రోడ్డు మార్గంలో గస్తీ నిర్వహించుచుండగా  శుక్రవారం ఒక ఆటో నందు లిక్కర్ తీసుకొని వెళ్తున్న సిద్దాపూర్ కు చెందిన రామోజీ విట్టల్ ను పట్టణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సిబ్బందికి చిక్కడం జరిగింది. వెంటనే అతన్ని అరెస్టు చేసి లిక్కర్ను సీజ్ చేసి ఆటోతోపాటు స్టేషన్ తరలించి కేసు నమోదు చేయడం జరిగింది.12.06 లీటర్ల లిక్కర్ తో పాటు ఆటో రిక్షాను సీజ్ చేయడంజరిగింది. ఈ  తనిఖీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్, సబ్ ఇన్స్పెక్టర్స్  ఏ. గంగాధర్, ప్రమోద్  చైతన్య, చంద్రమౌళి కానిస్టేబుల్స్ వికాస్ గౌడ్, సందీప్, దేవిదాస్ నరేష్ పాల్గొన్నారు.