దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా అదృశ్యమైనట్లు రాజబోయిన లక్ష్మీపతి మంగళవారం ఫిర్యాదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం. లక్ష్మీపతి బంధువైన రాజబోయిన డాకవ్వ ( 60 ) సంవత్సరాలు గల ఆమె యొక్క మానసిక స్థితి సరిగా లేదనీ, ఈమె ఇంతకు ముందు నుండి కూడా గత 40 సార్లుగా ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి వచ్చేదనీ, తేదీ 16 – 11 – 2024 ఉదయం 11 గంటల సమయంలో తమ కుటుంబం వ్యవసాయ పనులతో బయటకు వెళ్లగా ఆమె ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయిందని తిరిగి సాయంత్రం చూసినా రాలేదని పోలీస్ స్టేషన్కు వచ్చి డకవ్వ తప్పిపోయినదని దరఖాస్తు ఇవ్వగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సే రాజు తెలిపారు.