సనాతన ధర్మం వ్యాఖ్యల కేసు

సనాతన ధర్మం వ్యాఖ్యల కేసు– ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌ కోర్టు సమన్లు
పాట్నా : సనాతన ధర్మం వ్యాఖ్యల కేసులో తమిళనాడు క్రీడా మంత్రి, డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌లోని ఒక కోర్టు సమన్లు జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉదయనిధి వ్యాఖ్యలు ఉన్నాయని న్యాయవాది ధర్నింధర్‌ పాండే వేసిన పిటీషన్‌ను విచారణను స్వీకరించిన బీహార్‌లోని ఆరా కోర్టు మంగళవారం విచారణను ప్రారంభించింది. చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ మనోరంజన్‌ కుమార్‌ ఝా సమన్లు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్‌ 1కు వాయిదా వేశారు. గత ఏడాది సెప్టెంబర్‌ 2న చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన సంగతి తెలిసిందే. మద్రాస్‌ హైకోర్టులో స్టాలిన్‌కు వ్యతిరేకంగా పిటీషన్‌ దాఖలయింది. అలాగే ముజఫర్‌పూర్‌ కోర్టులోనూ సుధీర్‌ కుమార్‌ ఓజా అనే న్యాయవాది కేసు వేశారు.