నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన నాయకులను, అప్పుడు పోరాటం చేసిన ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడిన ఆర్ఎస్ఎస్ చీఫ్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హుస్నాబాద్ లో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ ఇంచార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని, సంవత్సరం 1947 కు సంబంధించి అది నిజమైన స్వాతంత్ర్యం కాదని, అప్పుడు స్వతంత్రం కొరకు పోరాటం చేసిన నాయకులను ప్రజలను జాతీయ జెండాను కించపరిచే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఇవే మాటలు వేరే దేశంలో మాట్లాడినట్టయితే కనీసం 15 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ ఈ దేశ ప్రధాని మోదీ ఎందుకు నోరు మూసుకుంటున్నాడో ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, జిల్లా ఇన్చార్జ్ డేగల వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగందుల శంకర్, నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, మారపల్లె సుధాకర్, మొగిలి పాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.