నవతెలంగాణ – ధర్మసాగర్
కేంద్ర సచివాలయ కార్యాలయమునకు సంబంధించిన ఏనిమిది మంది సచివాలయం అధికారులు రాష్ట్రంలో జరుగుచున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వం కు సంబంధించిన కార్యక్రమముల పరిశీలన కొరకు సోమవారం ధర్మసాగర్ మండలమును అడిషనల్ డిఆర్డిఓ ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భములో మండలములోని మహిళా సంఘాలకు సంబంధించిన పొదుపు విషయాలను ఐకెపి సెంటర్ సందర్శించి ఏపిఎం అనితను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సంబంధించిన విషయాలను పట్టా పాస్ బుక్ విధి విధానాలను స్థానిక తహసిల్దారు సదానందమును ఇతరాత్ర రెవెన్యూ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి సీజనల్ వ్యాధుల పట్ల దీర్ఘ కాలిక వ్యాధుల పట్ల వారు తీసుకునే చర్యలను జాగ్రత్తలను క్షుణ్ణంగా స్థానిక మెడికల్ ఆఫీసర్ గోపీనాథ్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడి ఆశ కార్యకర్తల విధివిధానాలను ఎలా ఉన్నాయని ఈ సందర్భంగా అడిగారు.పాఠశాలల పనితీరులను దానికి సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమములో కేంద్ర బృంద సభ్యులు శ్రీధర్ యాదవ్, బసంత్ నాథ్ సైన్, రంజిత్ సింగ్, రమేష్ దేశ్వాల్, సీమ అగర్వాల్, అన్మిక గుప్తా, పంకజ్ కుమార్ జైన్, తహసీల్దార్ సదానందం, ఏ.పి.ఏం. అనిత, మండల వైద్య అధికారి గోపి నాథ్, ఎంపీడీవో అనిల్ కుమార్, ఎంపీఓ అఫ్జల్ , ఐసిడిఎస్ సూపర్ వైసర్ తదితరులు పాల్గొన్నారు.