జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులే అధిక రక్తపో టుకు ప్రధాన కారణాలని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదమని ఆర్ హెచ్ఎఫ్ డబ్ల్యూటిసి ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ రెడ్డి అన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని కోఠి అవగాహన కార్యక్రమంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి, అధిక బరువు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మద్యం, ధూమపానం తాగడం, శారీరక శ్రమ లోపించడం, శీతల పానియాలు, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం అధిక రక్తపోటుకు గురవుతారన్నారు. మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నా బీపీ రావొచ్చన్నారు. తల తిరగడం, తలనొప్పి, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోలేకపోవడం, మూత్రంలో రక్తం వంటివి లక్షణాలుగా గుర్తించాలన్నారు. రోజూ 20 నిము షాల పాటు వ్యాయామం చేయడం, పోటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బీపీ బారిన పడకుండా కాపాడుకోవచ్చు అని సూచించారు.