మెప్పించే గ్యాంగ్‌స్టర్‌

మెప్పించే గ్యాంగ్‌స్టర్‌చంద్రశేఖర్‌ రాథోడ్‌, కాశ్వీ కాంచన్‌ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘గ్యాంగ్‌స్టర్‌’. వైల్డ్‌ వారియర్‌ ప్రొడక్షన్స్‌లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్‌ రాథోడ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్‌ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ను ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో ఆకాష్‌ పూరి అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్‌, ఇతర కంటెంట్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రేక్షకులు తప్పకుండా ఈ మూవీకి కనెక్ట్‌ అవుతారు. టెక్నికల్‌గా క్వాలిటీగా మూవీ చేశారు. ఫైట్స్‌, కొరియోగ్రఫీ, ఎడిటింగ్‌, రచన, నిర్మాత దర్శకత్వం..ఇవన్నీ ఒక్కరే చేయడం ఈజీ కాదు. చంద్రశేఖర్‌ రాథోడ్‌ అమేజింగ్‌ వర్క్‌ చేశారు. సినిమా మంచి హిట్‌ కావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ‘సినిమా మీద ప్యాషన్‌తో ఈ సినిమాను రూపొందించాను. సినిమా తెరకెక్కించడం, హీరోగా నటించడం నా కల. ఈ చిత్రంతో ఆ డ్రీమ్‌ నిజమైంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాను. మా మూవీ థియేటర్స్‌లోకి వస్తోంది. మీరంతా సినిమా చూసి ఎలా ఉందో మీ రెస్పాన్స్‌ తెలియజేస్తారని కోరుకుంటున్నా’ అని హీరో, దర్శక నిర్మాత చంద్రశేఖర్‌ రాథోడ్‌ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌ – జీఎల్‌ బాబు, ఫైట్స్‌, కొరియోగ్రఫీ, ఎడిటింగ్‌, రచన, నిర్మాత దర్శకత్వం- చంద్రశేఖర్‌ రాథోడ్‌.