మెప్పించే న్యూ ఏజ్‌ లవ్‌స్టోరీ

A charming new age love storyరాజా విక్రమ్‌ ప్రధాన పాత్రలో భరత్‌ నరేన్‌ దర్శకత్వంలో శ్రీ అక్కియన్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌ పై శ్రీధర్‌ మరిసా నిర్మించిన చిత్రం ‘దిల్‌ సే’. న్యూ ఏజ్‌ లవ్‌ స్టొరీగా రూపొందిన ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది.
డైరెక్టర్‌ బాబీ కొల్లి ఈ చిత్ర ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా బావుంది. అందరికీ థ్రిల్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనే కన్విక్షన్‌తో ఈ ట్రైలర్‌లో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పలేదు. అదే ఈ సినిమాకి ప్రత్యేకతని తీసుకొచ్చింది’ అని తెలిపారు. ‘ఇది నా మొదటి ప్రాజెక్ట్‌. నా పాత్రను దర్శకుడు చాలా అద్భుతంగా రాశారు. ఈనెల 16న ఈటీలో ఇది స్ట్రీమింగ్‌ అవుతుంది’ అని రాజా విక్రమ్‌ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ,’ఇందులో మాస్క్‌ వేసుకున్న అమ్మాయి ఎవరనేది ఏదో ఒక రోజు అందరికీ తెలుస్తుంది. మా సొంత బ్రదర్‌ ఈ సినిమాని నిర్మించారు’ అని చెప్పారు.