మెప్పించే టైగర్‌..

Lovely tiger..రవితేజ, దర్శకుడు వంశీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ అభిషేక్‌ అగర్వాల్‌ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ సినిమా ఈనెల 20న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ గ్రాండ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, ‘వంశీ ఈ కథ చెప్పినపుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. ఈ సినిమా మిమ్మల్ని గట్టిగా అలరిస్తుందని నమ్ముతున్నాను. అభిషేక్‌ అగర్వాల్‌ ఎక్కడా రాజీపడకుండా తీశారు. జీవి ప్రకాష్‌ మ్యూజిక్‌కి చాలా థ్రిల్‌ ఫీలౌతారు. సౌండ్‌ థియేటర్‌లో ఎలా ఉంటుందో చూడటానికి ఎదురుచూస్తున్నా. వంశీ సినిమాని అద్భుతంగా చేశాడు. అది ప్రేక్షకులు కూడా చూస్తారు’ అని తెలిపారు. ‘ఈ సినిమా జర్నీ పూర్తి కావడంపై నాకు డిఫరెంట్‌ ఫీలింగ్‌ ఉంది. వంశీతో నాలుగేళ్ల జర్నీ. మమ్మల్ని నమ్మిన రవితేజకి ధన్యవాదాలు’ అని అభిషేక్‌ అగర్వాల్‌ చెప్పారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ,’ఇది నాకు చాలా గొప్ప మూమెంట్‌. ఇది రవితేజ వలనే సాధ్య పడింది. విజయేంద్ర ప్రసాద్‌ కాల్‌ చేసిన ప్రత్యేకంగా ప్రశసించడం ఆనందంగా ఉంది. సినిమా చూశాను. మీరు అనుకునే దాని కంటే మించి ఉంటుంది. మీరు చూసిన ప్రతి సెకండ్‌ బయటికి వచ్చి మళ్ళీ చూడాలని అనుకుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ బెస్ట్‌ ఫిల్మ్‌ అవుతుంది’ అని తెలిపారు.