కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు అకాల మరణం చెందడంతో స్నేహితులు ఆర్థిక సహాయం అందజేసి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. మండలంలోని కొండూరు ప్రభుత్వ పాఠశాలలో 1998 – 99 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న కర్ర రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దాంతో పదవ తరగతి స్నేహితులు రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య స్నేహితుడు అర్థతరంగా మృతి చెందడం బాధాకరం అన్నారు. స్నేహితుడి కుటుంబానికి రానున్న రోజుల్లో తగిన సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్యమిత్రులు పూసమధు, అడ్లూరి ప్రవీణ్, నిమ్మల కుమార్, రాయిని సంతోష, పులి అంజయ్య, కర్ర ప్రవీణ్ రెడ్డి, యాకయ్య, కొమ్ము రాజు, ఉబ్బని నర్సింగం, కర్ణాకర్, పంతంగి యాకయ్య, పూస ప్రభాకర్, కురుపొద్దీన్, గజవెళ్లి వేణు, గుంటుక పెద్ద యాకయ్య, నాగరాణి, వెంకటేశ్వర్లు, పూస క్రిష్ణ, స్వరూప, విజయ, నజీర్ పాషా, చిదురాల సంధ్య, శేఖర్, మచ్చ రేణుక, కొమ్ము యాకయ్య, ముస్తఫ్ఫా తదితరులు పాల్గొన్నారు.