కథానాయకుడు నాని లేటెస్ట్‌గా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా మేకర్స్ గురువారం ఈ సినిమాలోని మొదటి పాట ‘సమయమా..’ను విడుదల చేసే తేదీని అనౌన్స్ చేశారు. ఈ పాట ఈనెల 16న విడుదల కానుంది. ఈ పాటను అనౌన్స్ చేస్తూ తెలిపే పోస్టర్‌లో నాని చిరునవ్వుతో అనందంగా కనిపిస్తున్నారు. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. మణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనుంది. ‘గ్లింప్స్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. గతంలోని నాని సినిమాల మాదిరిగానే ‘హారు నాన్న’ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌గా ఉంటుంది. డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి డీవోపీ: సాను జాన్ వర్గీస్.