యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా ‘హ్యాపీ ఎండింగ్’. అపూర్వ రావ్ హీరోయిన్. హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజరు రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్‌ను దర్శకుడు కౌశిక్ భీమిడి మీడియాతో షేర్ చేసుకున్నారు. ‘ఒక రోజు మహాభారతం చదువుతుంటే అందులో చాలా శాపాలు గురించి తెలిసింది. ఇలాంటి శాపాన్ని ఇప్పటి జనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ కథ ఉంటుంది. ‘విక్కీ డోనర్’ లాంటి మూవీస్ ఐడియా పరంగా అడల్ట్‌గా ఉన్నా..మూవీ ట్రీట్ మెంట్ మాత్రం అందరూ చూసేలా కన్వీన్సింగ్‌గా ఉంటుంది. మేము కూడా ఈ చిత్రాన్ని అలా ప్రేక్షకులంతా చూసేలా తెరకెక్కించాలి అనుకున్నాం. అలాగే ఇదొక మంచి రొమాంటిక్ డ్రామా. కథలో హీరోకు శాపం ఉంటుంది కాబట్టి అది అతనికి ట్రాజెడీ. కానీ చూసే ఆడియెన్స్‌కు మాత్రం నవ్వుకునేలా ఉంటుంది. అలాగే మా సినిమాలో రొమాన్స్ డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే ఎక్కడా అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా క్లీన్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఈ స్క్రిప్ట్‌కు యష్, అపూర్వ బాగా యాప్ట్ అయ్యారు. వాళ్ల పర్‌ఫార్మెన్స్ కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. సినిమా తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’ అని తెలిపారు.