క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

A clean family entertainerకె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తాజాగా రూపొందిన మరో లవ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఉషా పరిణయం’. ఈ చిత్రంలో శ్రీకమల్‌, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యతారలు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరి ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సక్సస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా దర్శక, నిర్మాత విజయభాస్కర్‌ మాట్లాడుతూ, ‘చాలా రోజుల తరువాత ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూశామని ప్రేక్షకులు అంటుంటే ఆనందంగా ఉంది. ‘నువ్వు నాకు నచ్చావ్‌’ తరహాలో వినోదంతో పాటు ‘నువ్వేకావాలి’ లాంటి టీనేజ్‌ లవ్‌స్టోరీ ఈ చిత్రంలో ఉందని అందరూ అంటున్నారు’ అని అన్నారు.