వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈనెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైమ్ కామెడీ జోనర్ ట్రై చేశాను. కామెడీ స్పేస్‌లో కాప్ రోల్ ప్లే చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. అలాగే ఫస్ట్ టైమ్ ఇందులో యాక్షన్ సీక్వెన్స్‌లు చేశాను. కాప్ రోల్ చేయాలనేది నా డ్రీమ్. లక్కీగా నా కెరీర్ బిగినింగ్‌లోనే రావడం సంతోషంగా ఉంది. వెంకటేష్‌తో వర్క్ చేయడం సూపర్ ఎక్స్‌పీరియన్స్. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. అనిల్, వెంకీది సూపర్ హిట్ కాంబినేషన్. ఐశ్వర్య రాజేష్‌తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా బాగుంది. నేను యాక్ట్ చేసిన సినిమాలో అన్ని పాటలు సూపర్ హిట్ కావడం ఇదే తొలిసారి. భీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్ లాగానే సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుంది.
గత సంక్రాంతికి ‘గుంటూరు కారం రిలీజ్’ అయ్యింది. ఇప్పుడు ఈ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీ ఒక డ్రీమ్‌లా ఉంది. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశాల్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
ఈ సినిమా కోసం డిఫరెంట్ పబ్లిసిటీ చేస్తున్నాం. ఇందులో భాగంగా అన్ స్టాపబుల్‌లో బాలయ్యని కలవడం చాలా హ్యాపీగా ఉంది. బాలయ్య..
వన్ అండ్ ఓన్లీ ఓజీ..(నవ్వుతూ) ఎప్పుడూ యాక్టీవ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. చాలా ఎమోషనల్ అండ్ వండర్ ఫుల్ పర్సన్.
నవీన్ పోలిశెట్టితో ఒక సినిమా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు మేకర్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ఏడాది కూడా వండర్ ఫుల్‌గా ఉంటుందని ఆశిస్తున్నాను. ఓ నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను. ఇంకా మంచి పాత్రలతో అలరిస్తా.