విశ్వక్‌సేన్, ఆకాంక్ష శర్మ జంటగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న చిత్రం ‘లైలా’. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ ‘ఇచ్చుకుందాం బేబీ..’ని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్ అప్ బీట్ మోడ్రన్ స్టయిల్ బ్లెండ్‌తో ఆకట్టుకుంది. ఈ పాటని ఆదిత్య ఆర్కే, ఎంఎం మానసి ఎనర్జిటిక్ వోకల్స్ ఆలపించారు. పూర్ణాచారి అందించిన సాహిత్యం లీడ్ పెయిర్ కెమిస్ట్రీని ప్రెజెంట్ చేసింది. ఫస్ట్ సింగిల్ ‘సోను మోడల్..’ లాగానే, ‘ఇచ్చుకుందాం బేబీ..’ కూడా సూపర్ హిట్ అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.
హీరో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ, ‘యాక్టర్‌గా నా విష్‌లో ఉన్న సినిమా ఇది. ఇలాంటి కథ, క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. డైరెక్టర్ రామ్ నారాయణ్ కథ చెప్పగానే, నేను చేస్తానని చెప్పాను. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత సాహుకి థ్యాంక్స్. ఫిబ్రవరి 14న వస్తున్నాం. వాలెంటైన్స్ డేకి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డేకి మీకు లైలా ఉంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ ఉన్నాడు(నవ్వుతూ). నా కెరీర్‌లో యాక్షన్ టచ్‌తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇదే. న్యూ ఏజ్ ఫిలిం. మీరంతా ఎంజారు చేస్తారు. ఇది పక్కా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ‘లైలా’ మీకు నచ్చుతుంది. ఫిబ్రవరి 1న రాయలసీయ మాస్ సాంగ్ ‘ఓహో రత్తమ్మ..’ రిలీజ్ చేస్తున్నాం’ అని తెలిపారు. ‘ఇలాంటి సబ్జెక్ట్ చేయడం ఒక ఛాలెంజ్. ఇలాంటి సబ్జెక్ట్‌ని ఒప్పుకున్నందుకు సాహుకి చాలా థ్యాంక్స్. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి ఉన్నోడే చేయాలి. అలాంటి పిచ్చి ఉన్న విశ్వక్ నాకు దొరికారు. తనకు లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను’ అని డైరెక్టర్ రామ్ నారాయణ్ చెప్పారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ, ‘విశ్వక్‌సేన్‌కి మంచి క్యారెక్టర్‌గా తన కెరీర్‌లో నిలిచిపోతుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.