హిందూ ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను సమానంగా చూస్తున్న సీఎం

– కోలేటి దామోదర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హిందూ ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను సీఎం కేసీఆర్‌ సమానంగా చూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ గహ నిర్మాణ సంస్థ లిమిటెడ్‌ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ కొనియాడారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రాహ్మణ సదనాన్ని హైదరాబాద్‌ లో నిర్మించి సంస్కతి, సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని తెలిపారు. వేదశాస్త్ర పండితులకు ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచడం, దాన్ని పొందే అర్హత వయస్సును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గించడం, 2,796 దేవాలయాలకు ధూపదీప నైవేధ్య పథకం వర్తింపచేయడం, అర్చకులకు నెలకు ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం సనాతన ధర్మ పరిరక్షణ నిలయంగా మారడం శుభ పరిణామమని తెలిపారు.