కారును ఢీకొీట్టిన బొగ్గు లారీ… ఒకరికి గాయాలు

నవతెలంగాణ-గణపురం
మండలంలోని చేల్పూర్‌ కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం సమీపంలో కారుకు బొగ్గు లారీ ఢీ కొట్టడంతో కూరాకుల రాజు(35) కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. రాజు తన కారు తో కుందూరు పల్లికి వస్తుండగా అతివేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టింది. దీనితో కారు నుజు నుజ్జు అయింది. గాయపడ్డ రాజు ను భూపాలపల్లి ఆస్పత్రి తరలించారు.