సున్నపు రాళ్ల తండాలో శీతల పండగ

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని గొడుగు మర్రి తాండ గ్రామపంచాయతీ పరిధిలో సున్నపు రాళ్ల తండాలో మంగళవారం గిరిజనుల ఆరాధ్య దైవం శీతల భవానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లాపాపలతో, వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పశువులు, పంటలు సమృద్ధిగా పండాలని గిరిజన సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో తాండ పెద్ద మనుషులు, తదితరులు పాల్గొన్నారు.