నవతెలంగాణ- మంగపేట
మండలంలోని నర్సింహాసాగర్ గ్రామపంచాయతీ నరేందర్ రావు పేటకు చెందిన తాటి అనురాద పూరిల్లు నేల కూలింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కురవడంతో పాటు ఇల్లంతా వర్షపు నీటితో నిండిపోవడంతో పునాదుల వరకే ఉన్న పూరల్లు నేలకూలినట్లు బాదితురాలు తెలిపింది. బుదవారం వర్షానికి ఇంట్లో ఉండగానే ఒక్కసారిగా నేల కూలడంతో ఇంట్లోని వారికి స్వల్ప గాయాలైనట్లు బాదితులు తెలిపారు. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని గిరిజన కుటుంబం కోరింది.