మార్కెట్ గోదాంను పరిశీలించిన కలెక్టర్ 

The district collector inspected the market warehouseనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ గోదాంను జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి మంగళవారం క్షేత్ర స్థాయిలో సందర్శించారు. వడ్ల కోనుగోలు కేంద్రాలు ప్రారంభమైన తర్వాత లారీలలో సెంటర్ల నుండి వరిధాన్యం గోదాం కు వచ్చిన వెంటనే దిగుమతి చేసుకోవాలని ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జి ఎండి. జైనులోద్దిన్ కి తెలిపారు. ఈ ఎఎంసి గోదాంలో  6షెడ్ లకు  1షెడ్ మాత్రమే ఖాళీ గా  ఉన్నదని, 5షెడ్ లలో ఎమున్నాయో వివరాలు అందించాలని సుచించారు. అలాగే ధాన్యం ఎక్కువగా వచ్చే సూచనలు కనిపిస్తున్నందున షెడ్ లను అవసరమైనన్ని కాలిగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లారీలలో  తేమశాతం కోలిచే యంత్రంతో వడ్ల తేమశాతం చెక్ చేశారు. గోదాంలో ధాన్యం నిలవచేయడానికి అన్ని సేప్టి మెథడ్స్ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసిల్దార్ రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.