నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ శుక్రవారం నాడు మద్నూరు మార్కెట్ పరిధిలో పత్తి కొనుగోలు జరిపే పత్తి మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిసిఐ అధికారి ఓబుల్ రెడ్డికి పత్తి కొనుగోలు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పత్తి అమ్మటానికి తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. ఈ మార్కెట్ పరిధిలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా పత్తి రైతులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, న్యాయబద్ధంగా కొనుగోలు జరగాలని ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ కమిటీ అధికారులు పత్తి కొనుగోలు పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్యకు అలాగే మద్నూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ రామ్నాథ్కు సూచించారు. పత్తి కొనుగోళ్ల గురించి పత్తి బేళ్ల తయారు గురించి పత్తి పరిశ్రమను సందర్శించి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పత్తి కొనుగోళ్లపై ఆరా తీయడంతో అధికారుల్లో పత్తి వ్యాపారుల్లో సిసిఐ కొనుగోలులలో అడలెత్తిపోయారు. కలెక్టర్ వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య మద్దూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ మద్నూర్ తాసిల్దార్ ఎండి ముజీబ్ మండల ప్రత్యేక అధికారి నాగరాజ్ ఎంపీడీవో రాణి ఎంపీ ఓ వెంకట నరసయ్య ఆర్ఐ శంకర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ రామ్నాథ్ సిసిఐ అధికారి ఓబుల్ రెడ్డి పత్తి మిల్లు యజమాని రాజేష్ కాకాని వివిధ శాఖల అధికారులు రైతులు పాల్గొన్నారు.