సమగ్ర కుటుంబ సర్వేలో ఏ ఒక్క ఇంటిని మినాయించకుండా పక్కాగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిర్వాహకులకు ఆదేశించారు. మంగళవారం రెంజల్ మండలం అంబేద్కర్ నగర్ గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక ,ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల కోసం నిర్వహిస్తున్న సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ప్రతి ఎన్యూమరేటర్ సగటున్న 15 ఇండ్లను సర్వే చేయాలని ఆయన సూచించారు. సర్వే వివరాలను క్షుణ్ణంగా పర్యవేక్షణ చేయాలని సూపర్వైజర్ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రవణ్ కుమార్, ఎంపీడీవో హెచ్ .శ్రీనివాస్, ఎంపీ ఓ రఫీ హైమద్, ఆర్ ఐ రవికుమార్, గ్రామ కార్యదర్శి సునీల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.