గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్

A collector who invented posters of Ganesh idolsనవతెలంగాణ –  కామారెడ్డి
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగహన కల్పించేందుకు. మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్  సాంగ్వాన్  పోస్టర్‌ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని  అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలొ భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు టి జి పి సి బి  నిర్వహంచడం జరుగుతుదన్నారు. అవగాహన కార్యక్రమాలలొ బాగంగా రాష్ట్ర వ్యాప్తం గా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ఆటోట్రాలీ ల ద్వారా పర్యావరణ సందేశంలతో ప్రదర్శన, ప్రింట్, ఎలక్ట్రనిక్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు టి జి పి సి బి  సిద్దమౌతుందన్నారు. మట్టి గణపతి ద్యారా పర్యావరణ పరిరక్షణ పై పాఠశాలలో, కళాశాలల్లో క్వీజ్ కార్యక్రమాలు నిర్వహించడం, చేతి వృత్తిల వారికి మట్టి విగ్రహలు తయారిపై శిక్షణ, ఆటోల వెనుక, పోస్టర్ల ప్రదర్శన, బస్టాప్ లలో హోర్డింగ్ లు మట్టి గణేష్ ల ద్యారా పర్యావరణ పరిరక్షణ పై కళాజాత  నిర్వహించడం జరుగుతోందన్నారు. చెరువుల్లో మట్టి మేటలని  తొలిగించటానికి  చెరువులో స్వచ్ఛత   కాపాడటానికి వినాయక చవితి సందర్బంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలాని మట్టి తో వినాయక విగ్రహాలు తాయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చన్నారు.