వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్ 

నవతెలంగాణ –  కామారెడ్డి
జిల్లా  కలెక్టర్ చాంబర్లో   ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం తల్లిపాల ప్రాముఖ్యతను తెలిపే వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆశిష్  సగ్వన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ  తల్లిపాలతో పిల్లలకు మానసిక, శారీరకంగా ఎదుగుదల, పోషకాలు అందుతాయన్నారు. తల్లిపాలలో రోగనిరోధక శక్తి ఉన్నందున అంటురోగాలు, అతిసారము, శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ ఉంటుందన్నారు. తల్లిపాలు తాగే శిశువుల మరణాల రేటు తక్కువగా ఉంటుందని సూచించారు. తల్లలకు  బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు  ఆసుపత్రులలో ప్రసవం  అయినా తక్షణమే శిశువుకు ముర్రుపాలు గంటలోపు తాగించాలని సూచించారు. తల్లిపాలు అమృతంతో సమానంగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి చంద్రశేఖర్, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి బావయ్య,  ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ అనురాధ, డి సి హెచ్ ఎస్ డాక్టర్ విజయలక్ష్మి, ఆర్ ఎం ఓ. డాక్టర్ శ్రీనివాస్, వేణుగోపాల్ చలపతి, పద్మజ, వినోద్ పాల్గొన్నారు.