రిమ్స్ కు వచ్చే రోగులు, వారి సహాయకులకు నాణ్యమైన విజయ డెయిరీ పాలు, పాల ఉత్పత్తులను అందించేలా రిమ్స్ ఆవరణలో పార్లర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆద్వర్యంలో రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ పార్లర్ ను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతకుముందు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పర్యేవేక్షకుడు డా.అశోక్ లు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. తొలుత ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాల ఉత్పత్తుల విక్రయాలను ప్రారంభించారు. జిల్లాలోని దూర ప్రాంతాల నుంచి రిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల విజయ డెయిరీ ఆధ్వర్యంలో నాణ్యమైన పాలను అందించే ఉద్దేశ్యంతో పార్లర్ ను ఏర్పాటు చేయడం హర్షనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. త్వరలో ఆర్టీసీ డిపోలోనే పార్లర్ ఏర్పాటు కానుందన్నారు. జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యాలయాలకు విజయ డెయిరీ పాలను అందించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. దూర ప్రాంతాల్లో ఉండే ఆశ్రమ పాఠశాలలకు సైతం విజయ డెయిరీ నుంచి పాలను సరఫరా చేసేందుకు డీడీ కృషి చేస్తున్నారన్నారు. దీనివల్ల అటు రైతులకు ఆదాయం పెంచేందుకు వీలు కలగడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను అందించవచ్చన్నారు. డెయిరీ బలోపేతం కోసం ఇది దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ మేనేజర్లు తుషార్, దస్రు నాయక్, పంపిణీదారు నరేందర్, సిబ్బంది ఊశన్న, సతీష్ పాల్గొన్నారు.