కాలేజీ కుర్రాడి ప్రయాణం

కాలేజీ కుర్రాడి ప్రయాణం‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా సక్సెస్‌ అందుకున్న పవన్‌ కుమార్‌ కొత్తూరి ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’ అంటూ దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 2న విడుదల కాబోతోంది. పీవీఆర్‌ ఐనాక్స్‌ పిక్చర్స్‌ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ కుమార్‌ కొత్తూరి మాట్లాడుతూ, ‘కాలేజ్‌ కుర్రాడంటే జాలీగా ఉంటాడని అంతా అనుకుంటారు. కానీ అదే ఛాలెంజింగ్‌ ఫేజ్‌. పిల్లలు, తల్లిదండ్రుల పడే బాధ, ఆవేదనతోపాటు ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌ను చూపించాను. కార్తీక్‌ మంచి ఆర్‌ఆర్‌ ఇచ్చాడు. సాజిష్‌ అద్భుతంగా చూపించారు. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్‌ చేసేందుకు రాబోతున్నాం. అందరూ చూసి సక్సెస్‌ చేయండి’ అని చెప్పారు.