కలర్‌ఫుల్‌గా స్పార్క్‌.. సాంగ్‌

కలర్‌ఫుల్‌గా స్పార్క్‌.. సాంగ్‌విజయ్, వెంకట్‌ ప్రభుల మోస్ట్‌ ఎవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ ది గోట్‌. (ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌). ఈ సినిమా మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ చార్ట్‌ బస్టర్‌ నోట్‌లో స్టార్ట్‌ అయ్యాయి. ఫస్ట్‌ సింగిల్‌ ‘విజిలేస్కో’, సెకండ్‌ సింగిల్‌ ‘నిన్ను కన్న కనులే’ చార్ట్‌ బస్టర్‌ హిట్‌ అయ్యాయి. తాజాగా మేకర్స్‌ ‘స్పార్క్‌..’ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. యువన్‌ శంకర్‌ రాజా ఈ పాటని థంపింగ్‌ బీట్స్‌తో వైరల్‌ ట్యూన్‌గా కంపోజ్‌ చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. యువన్‌ శంకర్‌ రాజా, వష బాలు ఎనర్జిటిక్‌గా పాడారు. ఈ సాంగ్‌లో విజరు డ్యాన్స్‌ మూమెంట్స్‌ మెస్మరైజ్‌ చేశాయి. విజరు, మీనాక్షి చౌదరి మాగటిక్‌ కెమిస్ట్రీని షేర్‌ చేసుకున్నారు. ఈ సాంగ్‌ ఇన్‌స్టంట్‌ హిట్‌గా నిలిచింది. విజరు ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్‌, ప్రభుదేవా, మోహన్‌, జయరామ్‌, స్నేహ, లైలా, అజ్మల్‌ అమీర్‌, మీనాక్షి చౌదరి తదితరులు నటిస్తున్నారు.