సూపర్‌విలన్‌తో ఓ సామాన్యుడి పోరాటం

సూపర్‌విలన్‌తో ఓ సామాన్యుడి పోరాటంహీరో సందీప్‌ కిషన్‌, విఐ ఆనంద్‌ కాంబినేషన్‌లో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేస్తున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. లేటెస్ట్‌గా ఇదే బ్యానర్‌లో ప్రొడక్షన్‌ నెం.26 కోసం సందీప్‌కిషన్‌ మళ్ళీ నటిస్తున్నారు. ‘ప్రాజెక్ట్‌జెడ్‌’ సంచలన విజయం తర్వాత సందీప్‌ కిషన్‌తో సివి కుమార్‌ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ప్రాజెక్ట్‌జెడ్‌’ వరల్డ్‌లో సెట్‌ చేయబడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ దీనికి సీక్వెల్‌. ఈ చిత్రానికి ‘మాయావన్‌’ అని టైటిల్‌ పెట్టారు. అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమర్పణలో రాంబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్‌ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. ఈ చిత్రం సందీప్‌ కిషన్‌కు జోడిగా ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ నటిస్తున్నారు. సూపర్‌విలన్‌తో ఓ సామాన్యుడి ఘర్షణ కథగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: సివి కుమార్‌, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, డీవోపీ: కార్తీక్‌ కె తిల్లై, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌.