సామాన్యుడి పోరాటం

A common man's struggleడైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘పెదకాపు-1’. విరాట్‌ కర్ణ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానున్న నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను డైరెక్టర్‌ వివి వినాయక్‌, నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ లాంచ్‌ చేయగా, మైత్రీ మూవీ మేకర్స్‌ రవిశంకర్‌, మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ శశిధర్‌ రెడ్డి అతిథులుగా విచ్చేసి, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ఈ ఈవెంట్‌లో వివి వినాయక్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా బావుంది. సినిమా అద్భుతంగా వుంటుంది. రవీందర్‌ రెడ్డి ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు’ అని తెలిపారు. ‘ఈ సినిమాకి ఓ మంచి ఉద్దేశంతో సామాన్యుడి సంతకం అని పెట్టాను. ఒక సామాన్యుడ్ని తెరమీద కొన్ని కోట్లమంది చూసుకొని, ఆ సామన్యుల తరపున నిలబడే ఒక పాత్రని మలిచినదే ఈ పెదకాపు1’ అని దర్శకుడు అన్నారు.