
నవతెలంగాణ – చిన్నకోడూరు
బైండ్ల సంఘం సభ్యులందరూ ఐక్యమత్యములు కలిగి ముందుకు సాగాలని బీఆర్ఎస్ పార్టీ చిన్నకోడూరు మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులో బుధవారం బైండ్ల సంఘం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంలో బైండ్ల కులం వారికి గ్రామంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారనీ తెలిపారు. చిన్నకోడూరు గ్రామపంచాయతీ పాలకవర్గంలో వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచ్ గా, రేషన్ డీలర్, అల్లీపూర్ పిఎసీఎస్ డైరెక్టర్, చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులు బైండ్ల వారు నిర్వహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బైండ్ల సామాజిక వర్గానికి సమాజంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ముందుకు సాగుతున్నారని, గుర్తింపును కలిగి ఉన్నారని తెలిపారు. కేవలం కులవృత్తిని చేసేందుకు మాత్రమే పరిమితం కాకుండా పేదరిక నిర్మూలనకు కృషి చేసి మంచి భవిష్యత్తును అందుకోవాలని కాంక్షించారు. ఈ సందర్భంగా బైండ్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ కమ్యూనిటీ భవనము, ఫంక్షన్ హాలు నిర్మించాలని, కళాకారుల ఫించన్ ఇప్పించాలని, దళిత బంధు, గృహ లక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్తామని, బైండ్ల సంఘం సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు హామి ఇచ్చారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కార్యవర్గాన్ని గౌరవ అధ్యక్షుడు కనకయ్య, అధ్యక్షుడు నర్సయ్య, ఉపాధ్యక్షుడు ఎల్లయ్య, ప్రధాన కార్యదర్శి చిన్న నర్సయ్య, కోశాధికారి నర్సయ్య, క్యాషియర్ రాజయ్య, సలహాదారులు సేనాపతి, రాంబాబులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కాముని ఉమేష్ చంద్ర, స్థానిక ఎంపీటీసీ -1 పానుగంటి శారదా రమేష్, ఎంపిటిసి-2 మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఇట్టబోయిన శ్రీనివాస్, ఉపసర్పంచ్ తడ్కమడ్ల శ్రీకాంత్, ఏఎంసీ డైరెక్టర్ బైండ్ల సుధాకర్, కిషన్, ప్రసాద్, నవీన్, భరత్ కుమార్, వెంకటేష్, రాజు, రోహిత్, వంశీ, అశోక్, ప్రశాంత్, మహేష్, శ్రీను, రవి, అంజి, భాను తదితరులు పాల్గొన్నారు.