– ఆర్డీఓ మధు తో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా….
నవతెలంగాణ – అశ్వారావుపేట
పెద్దవాగు కు గండి పడి ముంపుకు గురైన గ్రామాల్లో ఎకరానికి రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని,గృహం కోల్పోయిన వారికి వెంటనే గృహాలు నిర్మించాలని,పొలాల్లో వేసిన ఇసుక మేట్ల ను తొలగించడానికి చర్యలు చేపట్టాలని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గురువారం గండి పడ్డ మండల పరిధిలోని గుమ్మడవల్లి సమీపంలో గల గుమ్మడి వల్లి ప్రాజెక్ట్ ను శనివారం ఆయన పరిశీలించి,ముంపు ప్రభావిత గ్రామాలను,పొలాలను,నిర్వాసితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలా ప్రాజక్ట్ కి గండి పడడం చాలా బాధాకరమని,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లె ఇంత నష్టం జరిగిందని,వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే హైదారాబాద్ లో తిరగడం తప్ప నియోజక వర్గంలో ఏం జరుగుతుంది,ఇక్కడ ప్రజలకు ఏం అవసరం అనే విషయాలు పట్టించుకోవడం లేదని,ఎక్కడ ఏం చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయో అనే ఆలోచన వారికి లేదని ఎద్దేవా చేసారు.ఎంత సేపు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మీద బురద చల్లడం తప్ప కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చెయ్యడం చేత కావట్లేదని ఆరోపించారు.ప్రజల సమస్యలు,వారి బాగోగుల గురించి గాలికి వదిలేసారు అని,గండి పడడం వల్ల ఎన్నో గ్రామాలు నీట మునిగాయి అని,ఇల్లు కోల్పోయిన వారికి రూ. 5 లక్షలు,ప్రతి ఎకరానికి 50 వేలు,పశువులు,గొర్రెలు,కోల్పోయిన వారికి నష్ట పరిహారం ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే పొలంలో పేరుకుపోయిన ఇసుకను బయటకు తరలించేందుకు ఏర్పాట్లు చెయ్యాలని.ఈ తప్పిదం వల్ల వ్యవసాయం చేసే అవకాశం కోల్పోయారని,ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించుకుని వెంటనే మరమత్తులు చేపట్టాలని తెలిపారు. అదే సమయానికి అక్కడికి ఆర్డీఓ మధు రావడంతో నష్టపరిహారం త్వరగా అందేవిధంగా మరియు ఇసుక తరలింపు,మరమ్మతులు గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామ మూర్తి,మోహన్ రెడ్డి,సత్యవరపు సంపూర్ణ,చందా లక్ష్మి నర్సయ్య,పుట్టా సత్యం,నారం రాజ శేఖర్,యార్లగడ్డ శ్రీను,బుజ్జి బాబు,చిప్పనపల్లి శ్రీను,స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.