నవతెలంగాణ-కంటేశ్వర్
నేడు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని విద్యుత్ దీపాల వెలుగులతో నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం విరాజిల్లుతోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఐడిఓసి సముదాయాన్ని సుందరంగా అలంకరించారు. ఐడిఓసి సముదాయంలో జిల్లా స్థాయిలో శుక్రవారం జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా విద్యుత్ దీపాల వెలుగులు, హంగు ఆర్భాటాలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సరికొత్త అందాలను సంతరించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.