కామారెడ్డి పట్టణంలో ఇంటింటి సమగ్ర సర్వే ముమ్మరంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఎన్యుమరేటర్లు ఇళ్ల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తున్నారు. ముందుగా హౌస్ స్టిక్ చేసి గుర్తించిన ఇళ్ల వద్దకు వెళ్లి సమగ్రంగా వివరాలు సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం 14వ వార్డులో ని కాకతీయనగర్ కాలనీలో వివరాలు సేకరించారు. అందులో భాగంగా కాకతీయ నగర్ లో ఎన్యుమరేటర్ రమ్య ఆద్వర్యంలో వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటా తిరిగి కుటుంబాలకు సంబందించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులతో పాటు వివిధ వివరాలను పక్కాగా నమోదు చేసినట్లు వివరించారు. ఉద్యోగ, ఉపాధి, తదితర వివరాలను పక్కాగా నమోదు చేయడం జరుగుతుందన్నారు.. శనివారం వరకు హౌస్ స్టిక్ వేసి ఇళ్లను గుర్తించామని అనంతరం ఆదివారం నుంచి ఇంటింటా సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటా తిరిగి వివరాలను నమోదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ సర్వేకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ నెల 18 వరకు ఇంటింటా సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్యుమరేటర్లకు అడిగిన వివరాలు అందించి సమగ్ర సమాచారం ప్రభుత్వ నిబందనలకు అనుగుణంగా అందించాలని ఆమె ప్రజలను కోరారు.