– తహసీల్ధార్ కు వినతిపత్రం అందజేత..
నవతెలంగాణ – రెంజల్
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ శనివారం రెంజల్ తహసీల్ధార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఎంఎల్ ప్రజా పంత మాస్ లైన్ నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్ధార్ శ్రావణ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశంలో 60% మంది కార్మికులు వ్యవసాయ పనులు చేస్తున్నారని వారికి సమగ్రమైన చట్టం తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రోజుకు రూ.600 రూపాయలు, 50 సంవత్సరాలు నిండిన వేసవి కార్మికులకు సంవత్సరానికి రూ.12,000 ప్రభుత్వం ప్రకటించాలన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి ఇంటి స్థలాలను ఇవ్వడమే కాకుండా వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ ప్రజా పంత మాస్ లైన్ నాయకులు పుట్టినడిపి నాగన్న, పార్వతీ రాజేశ్వర్, వడ్డెన్న, మండల ప్రధాన కార్యదర్శి ఎస్కే నసీర్, సంతోష్, సిద్ధ పోశెట్టి, మక్కన్న, హైమద్, జబ్బర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.