– అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండపల్లి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – నెల్లికుదురు
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేసి రూ.12 వేల జీవన మృతిని నెలకు అందించే విధంగా కృషి చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బండపల్లి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలోని తాసిల్దార్ కోడి చింతల రాజుకు వినతి పత్రం అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రూ.45 కోట్ల బడ్జెట్లో గాని రాష్ట్ర ప్రభుత్వ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో గాని వ్యవసాయ కూలీలకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు జరపలేదు. వ్యవసాయ ఉత్పత్తలో కూలీల శ్రమ మూలమైంది. నేడున్న ధరల ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే కనీసంగా నెలకు రూ.26000 కావాలి. 60 లక్షల మంది వ్యవసాయ కూలీలు రాష్ట్రంలో ఉన్నారు ఈ ఆదాయం సమకూర్చే శక్తి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ సంపన్న కార్పొరేట్ వర్గాలపై ప్రేమతో వీరికి ఏమీ చేయటం లేదు. రేవంత్ రెడ్డి వ్యవసాయ కార్మికులకు రూ.12000 జీవనభృతి ఇస్తానన్న హామీని ఇంతవరకు అమలు చేయలేదు. ఆరు గ్యారెంటీ ల అమలు అస్తవ్యస్తంగా, అరకొరగానే ఉన్నది. దేశవ్యాప్తంగా 14 కోట్ల వ్యవసాయ కూలీలకు కేంద్ర బిజెపి గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. పైగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చమత్కారాలతో విమర్శలు చేసుకుంటూ కూలీలను మోసం చేస్తున్నారు. మూడు ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న రైతులు కూడా కూలిపైన ఆధారపడుతున్నారు. అని అన్నారు. ఇతర కార్మికులకు ఇస్తున్నట్టుగా నెలకు రూ.2000 పెన్షన్ సంవత్సరానికి రూ.24,000 అవుతున్నాయి. వ్యవసాయ కూలీలకు కనీసం గా జీవన భృతి నెలకు రూ.12 వేల ఇవ్వాలని మా సంఘం డిమాండ్ చేస్తున్నాది. కావున దేశంలో 60 శాతం మంది గా ఉన్న వ్యవసాయ కూలీలకు తక్షణమే జీవన భృతిస్తూ, ఇతర పేదలకు పెన్షన్ కూడా రూ.4000 ఇవ్వాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది అని అన్నారు. అన్నారు. డిసెంబరు 2 వరకు నిర్వహించే ఆందోళనలో వ్యవసాయ కార్మికులు ఇతర పేదలు విరివిగా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లికుదురు మండల వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బూర్గుల రమేష్, జిల్లా నాయకులు పాపారావు, కందాల రంగయ్య, నరసమ్మ, రామకృష్ణ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.