– పర్యవేక్షించిన తహశీల్దార్ గిరిబాబు..
నవతెలంగాణ – తాడ్వాయి
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వేను సమగ్రంగా నిర్వహించాలని ఎన్యూమరేటర్ లకు తహశీల్దార్ బి గిరిబాబు సూచించారు. బుధవారం ప్రారంభమైన సమగ్ర సర్వేను మండల కేంద్రంతో పాటు, మండలంలోని పలు పంచాయతీలలో ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమగ్ర సర్వే నిర్వహణకు మండల వ్యాప్తంగా ఉన్న 6380 గృహాలను, బ్లాకు లు గా విభజించి, ఎన్యూమరేటర్ లతో సమగ్ర సర్వే ప్రారంభించినట్లు వివరించారు. ఒక్కో ఎన్యూమరేటర్ కు సుమారు150 ఇళ్ళను సర్వే కు కేటాయించటం జరిగిందని, రోజు ఇళ్ళు సర్వే చేసి ఈ నెలా 11 వ తారీకు వరకు పూర్తవుతుందని తెలిపారు. పూర్తి సమాచారాన్ని సంభందిత కార్యాలయంలో అందించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ముందుగా ఈ నెల 6 నుండి 8 వరకు ఇళ్ళు గుర్తించి ఆ ఇళ్ళకు స్టిక్కర్ లు అంటించిన తరువాత సర్వే ప్రారంభించటం జరుగుతుందని అందుకు ప్రజలు పూర్తి సహకారాన్ని అందించాలని కోరారు.