జెడ్పి పీఠం కదలకుండా, రాజీ ప్రయత్నం..?

నవతెలంగాణ- నిజామాబాద్
కామారెడ్డి జిల్లా వివిధ మండలాల జెడ్పిటిసిలు, పార్టీలకతీతంగా తాడ్వాయి మండలం సోమార్ పేట తండాలోని పైడి ఎల్లారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో రహస్య సమావేశమై పాలకవర్గంపై అవిశ్వాస తీర్మానంపై బుధవారం చర్చించారు. విషయం పత్రికల్లో రావడంతో, పాలకవర్గం అలర్టై జెడ్పి పీఠం కదలకుండా, పలు జెడ్పిటిసి లకు రాజీ ప్రయత్నం కుదురించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. 2019లో జిల్లాలోని 22 మండలాల జడ్పిటిసి లకు ఎన్నికలు నిర్వహించగా 14 జెడ్పిటిసి స్థానాలను ఆనాటి టిఆర్ఎస్ కైవాసం చేసుకోగా, 8 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. జెడ్పి చైర్మన్గా టిఆర్ఎస్ అభ్యర్థి డి రాజు శోభను ఎన్నుకోగా, వైస్ చైర్మన్ గా ప్రేమ్ కుమార్ ను ఎన్నుకున్నారు. గత నాలుగు సంవత్సరాల నుండి పాలకవర్గంపై ఉన్న వ్యతిరేకత, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే, బయటపడింది.