నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండలంలోని అంతంపల్లి గ్రామ శివారులో ఉన్న రాఘవ లైఫ్ సైన్స్ కెమికల్ కంపెనీలో సివిల్ వర్క్ కాంట్రాక్ట్ పనులు చేయించుకొని గత మూడు నెలల నుండి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేయడంతో రాజంపేట పట్టణానికి చెందిన రమేష్, ఇతర వ్యక్తులు కంపెనీ ముందు బుధవారం ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ కంపెనీలో సివిల్ కాంటాక్ట్ పనులకు సుమారు 5 లక్షల రూపాయలు బిల్లు రావాల్సి ఉందని కంపెనీ నిర్వాహకులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారని అప్పుచేసి పనులు చేస్తే వడ్డీ కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నానని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం ట్రాక్టర్, జెసిబి, ఇసుక, కంకర డబ్బులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సుమారు గంట పాటు కంపెనీ ముందు ఆందోళన నిర్వహించి త్వరలో డబ్బులు చెల్లిస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇవ్వడంతో అక్కడి నుండి వెళ్లిపోయారు.