దేశంలో రెండు కోడ్‌లను రాజ్యాంగం అమలు చేస్తున్నది. ఒకటి క్రిమినల్ ప్రోసీజర్ కోడ్, రెండు సివిల్ కోడ్. దేశానికి క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ ఒకటే ఉంది కానీ సివిల్‌కోడ్ వివిధ మతాచారాల ప్రకారం పని చేస్తున్నది. సివిల్‌కోడ్ భిన్నంగా ఉన్నప్పటికీ అది ఏకత్వం కొనసాగిస్తున్నది. అనేక మతాలు, వాటి ఆచారవ్యవహారాలు విడిగా ఉన్నప్ప టికీ దేశంగా అన్ని మతాలు దేశాభివృద్ధి విషయంలో ఒకే అభిప్రాయంతో కొన సాగుతున్నాయి. భారత రాజ్యాంగం ఆర్టికల్-44 ప్రకారం వివిధ అభిప్రాయాలు, ఆచార వ్యవ హారాలు ఉన్నప్పటికీ సర్వ జాతులు, మతాలు, కులాలు లింగ బేధం లేకుండా సమాన హక్కులు కలిగి ఉండాలని చెప్తు న్నది. కానీ, అర్టికల్-44కు సవరణ తెచ్చి దేశంలోని ప్రజలందరికీ ”ఒకే సివిల్ కోడ్” (ఒకే సామాజిక చట్టం) తేవాలని బీజేపీ ప్రభుత్వం ప్రతి పాదనలు చేసింది. కానీ, ఈ ప్రతి పాదనలను ఒక డాక్యుమెంట్ రూపంలో ప్రజల ముందు పెట్టకుండా చర్చ నీయంశంగా విడివిడిగా అంశాలను ప్రకటించింది. 11జులై 2023 నాటికి అభ్యంతరాలు ఉన్నవారు లా కమిషన్‌కు చెప్పుకో వాలని సూచించింది. అభ్యం తరాలు వచ్చిన తరు వాత లా కమిషన్ ప్రజలకు నోటీసు జారీ చేస్తుంది. 2018 ఆగస్టులో 21వ లా కమిషన్ వేయగా ఆ కమిషన్ కామన్ సివిల్‌కోడ్‌కు ప్రస్తుత పరిస్థితులు అనుకూలం గా లేవని ప్రకటించడంతో దానిని రద్దుచేసి 22వ లా కమిషన్ ను వేసింది. కేంద్ర బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం దేశంలో కామన్ సివిల్ కోడ్ తెచ్చి మైనార్టీ మతాల ఆచార వ్యవహారా లలో సవరణలు చేసి వాటిని హిందూ ఆచార వ్యవహారాలకు అనుకూలంగా మార్చాలని ఈ ప్రయత్నం సాగిస్తున్నది.
దేశంలో నేటికి స్త్రీ/పురుషుల మధ్య అనేక ఆచార వ్యవహారాలు వేర్వేరుగా ఉన్నాయి. అంతే గాక జాతులు, మతాలు, కులాలతో పాటు చివరికి ఏజెన్సీ, మైదాన ప్రాంతంలోనూ మార్పులు కొన సాగుతున్నాయి. వివాహాలు, విడాకులు, దత్తత తీసుకోవడం, మతం మారడం, వారసత్వం తది తర అంశాలలో ఒక్కో మతంలో భిన్నమైన ఆచార వ్యవహారాలున్నాయి. స్త్రీ/పురుషులలోనే పురు షుడు సంతానం లేకపోతే రెండో వివాహం చేసు కోవడానికి కొన్ని వర్గాలు అనుమతిస్తాయి. పిల్లలు పుట్టని మహిళలను విడాకులు చేసుకోవడానికి అంగీ కరిస్తాయి. ఏజెన్సీ ఏరియాలో గిరిజనులు ఒకటికి మించిన వివాహాలు చేసుకోవడానికి నేటికి వారి ఆచార వ్యవహారాలు అనుమతిస్తున్నాయి. ఒకజాతి వారు మరోజాతి వారితో వివాహా సంబంధాలు పెట్టుకోవడాన్ని నేరంగా పరిగణిస్తున్నాయి. దేశంలో కులాంతర వివాహాల సందర్భంగా ”కుల దురహంకార హత్యలు” పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. గతంలో సతీసహ గమనం ఆచరించి భర్త చనిపోతే అతని చితిలో భార్యను కూడా కాల్చివేసేవారు. అనేక సంస్కరణల పోరాటాల ఫలితంగా ఈ దురాచారం తగ్గింది. బాల్య వివాహాలు కూడా పోరాటాల ద్వారా తగ్గడంతో పై రెండింటిని ”సివిల్ కోడ్”లో చేర్చారు. ముస్లిం మైనార్టీలలో ‘త్రిపుల్ తలాక్’ అని భార్యకు చెప్పడంతో భార్యకు విడాకులు ఇచ్చిన దానికింద చట్టం చెల్లుబాటు అవుతుందని ”ముస్లిం పర్సనల్‌లా” చెప్తున్నది. 75 సంవత్సరాల షాబాన్ కేసులో సుప్రీంకోర్టు విడాకులు ఇచ్చినప్పటికీ భర్త నుండి పరి హారం ఇప్పించింది. ఆ విధంగా పర్సనల్‌లాకు వ్యతిరేకంగా సుప్రీం తీర్పు ఇచ్చింది. ముస్లింలలో ఎందరినైనా వివాహాం చేసుకునే ఆచారం నేటికి కొనసాగు తున్నది. బురఖా ధరిం చడం తప్పని సరిచేసింది. ముస్లింలు ఖురాన్‌ను చట్టంగా అను మతిస్తారు. షరియత్ చట్టం ప్రకారం తమ మతంలో ఆచారాలు కొనసాగిస్తున్నారు. క్రైస్తవులలో స్త్రీకన్న పురుషుడు ఆధిపత్యం కలిగినవాడని బైబిల్ చెప్తున్నది. స్త్రీ పురుషునికి లోబడి ఉండాలని నిర్దేశించింది. బైబిల్‌లోని స్త్రీ/ పురుష సంబంధాలను క్రైస్తవులు ఆచారంగా ఆమోదిస్తారు. బౌధ్దమతంలో కులాలు, వర్గాలు తేడాలు ఏమిలేవు. అందరూ సమానంగానే ఉంటారు. అందరికీ సమాన హక్కులు ఉంటాయి.
ఆ విధంగా దేశంలో ఒక్కో మతంలో, ఒక్కో కులంలో ఒక్కో ఆచార ధర్మాలు కొనసాగుతున్నాయి. అలాగే దైవభక్తిలో మతాల మధ్య అనేక అంతరాలున్నాయి. వీటన్నింటిని ఏకీ కృతం చేసి ”దేశంలో కామన్ సివిల్ కోడ్” (యూనిఫాం సివిల్ కోడ్) ఏర్పాటు చేయాలనప్పుడు పైమతాలలో ఉన్న వివిధ ఆచార వ్యవహారాలను ఆ మతంలోనే ఏకీకృతం చేయాలి. మొదట హిందూమతంలో గల ఆచార వ్యవహారాలను ఒకే రూపం తీసు కునే విధంగా మార్చాలి. ఆ విధంగా ఒక్కో మతంలో గల విభిన్న వ్యవహారాలను ఒకే విధంగా మార్పు చేసిన తరువాత, అన్ని మతాలలో ఒకే సివిల్ కోడ్ పెట్టడానికి వీలుంటుంది. కానీ పై వివిధ ఆచారాలను సంస్కరించకుండానే ”కామన్ సివిల్ కోడ్” ప్రవేశ పెట్టాలని 22వ లా కమిషన్ చేప్పడం దేశ ప్రజలలో తీవ్ర వైరుధ్యాలను మొలకెత్తిస్తుంది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రశాంత జీవనం కనుమరుగు అవుతుంది. మెజార్టీ మతస్తులు మైనార్టీ మతంపై హింస ప్రారంభించడం జరుగుతుంది. ప్రస్తుతం అరుణాచల ్‌ప్రదేశ్‌లో అదే జరుగుతున్నది. అంత చిన్న రాష్ట్రంలో జరుగు తున్న అల్లరులను పెద్ద భారతదేశం శాంతింపజేయలేక పోతున్నది. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడప్పుడు ప్రస్తుతం ఉన్న సైన్యంగానీ, ప్రభుత్వంగానీ, శాంతి-భద్రతలను కాపాడడంలో నిస్సహాయం కాక తప్పదు. దేశం యుద్ధ రంగంగా తయారవుతుంది.బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం కోరుకునేది ఇలాంటి పరిస్థితి సృష్టించాలనే తప్ప వేరు కాదు.
గడిచిన కాలంలో సతీసహగమనం, వితంతువు పునర్వి వాహం, మహిళలకు చదువు, 18 సంవత్సరాలకు ఓటింగ్ హక్కు, వివిధ దేవతల పూజలలో హింస తొలగింపులాంటి సంస్కరణలు అమలు కావడానికి దశాబ్దాల కాలం పట్టింది. అలాగే ముస్లిం లలో తలాక్ (విడాకులు) చట్టానికి పార్లమెంట్ ఆమోదం పొందడం కూడా అంతే కాలం పట్టింది.నాడు మూడ విశ్వాసాలు అన్న అంశాలను మార్పు చేయడానికి ఓపికతో దశాబ్దాల తరబడి పోరాటాలు చేసిన ఫలితంగానే అమలులోకి వచ్చాయి. మతాల మధ్య ఘర్షణలు కూడా క్రమానుగతంగా సమసిపోయి సామరస్యం కొనసాగుతున్నది. ప్రపంచ దేశాలలో కూడా ఈ సామాజిక మార్పులు రావడానికి శతాబ్దాల కాలం పట్టింది. అలాంటిది లా కమిషన్ రికమండేషన్ చేయడం, పార్లమెంట్‌లో బిల్లు పెట్టడం ద్వారా ”కామన్ సివిల్ కోడ్” అమలవుతుందనుకోవడం భ్రమ తప్ప మరోటి కాదు. ప్రాథమికంగా చేయాల్సిన పనులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయాలి.
దేశ అభివృద్ధి కాముకులు కోరుకునేది మొదట ఆయా మతాలలో, జాతులలో, ప్రాంతాలలో స్త్రీ/పురుషుల మధ్య గల విభిన్న ఆచార వ్యవహారాలను ఎక్కడికక్కడ ఒకే తాటిమీదికి తేవాలి. ఆ తరువాత దేశంలోని అన్ని మతాలను, జాతులకు, స్త్రీ/ పురుషులకు ”కామన్ సివిల్ కోడ్” తెచ్చే ప్రయత్నం చేయాలి. ప్రాథమికమైన ఈ పనులు చేయకుండానే రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలులోకి తేవడానికి లా కమిషన్‌ను వేసి ప్రజలలో ఆలజడి సృష్టించడం సరికాదు. రానున్న ఎన్నికల దృష్ట్యా మెజార్టీ వర్గాలను ఆకర్షించి వారికి వ్యతిరేకంగా మైనార్టీ వర్గాలను నిలిపి ఓట్లు సంపాదించ డానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న ఈ దుష్ట ప్రయత్నాన్ని లౌకిక వాదులు, వామపక్షవాదులు, దేశాభిమానులు స్త్రీ/ పురుషులతో సహా తీవ్రంగా ఖండించాలి. దేశ పరిస్థితులను అధ్యయనం చేయకుండా, ప్రాథమికంగా ఆయా మతాలలో గల ఆచార వ్యవహారాలను మార్పు చేయకుండా మూకుమ్మడిగా అన్ని మతాలలో ఒకేసారి చర్చనీయాంశం చేయడం ఎంత ప్రమా దమో అర్థం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో యూనిఫాం సివిల్ కోడ్‌పై అన్ని వర్గాల ప్రజానీకంలో చర్చనీయాంశం చేయాలి. వారందరినీ చర్చలలో భాగస్వాము లను చేయాలి. ప్రస్తుతం లా కమిషన్ ప్రవేశపెట్టిన యూనిఫాం సిివిల్ కోడ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. శాంతి-భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ ఒకే వేదిక మీదికి రావాలి.
– సారంపల్లి మల్లారెెెడ్డి
9490098666