ఆర్టీసీ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ

– ఒకరికి తీవ్ర గాయాలు
– బస్వాపూర్ హైవే పై ఘటన
– 36 మంది ప్రయాణికులు సురక్షితం
నవతెలంగాణ-భిక్కనూర్
ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్ గా బ్రేక్ వేయడంతో దాని వెనకాలే వస్తున్న  కంటైనర్ వాహనం బస్సును ఢీ కొట్టిన్న ఘటనలో ఒకరికి తలకు తీవ్ర గాయాలు కాగా మరో 35 మంది సురక్షితంగా ఉన్నారు. వివరాలు ఎలా ఉన్నాయి హైదరాబాద్ నుంచి 36 మంది ప్యాసింజర్లతో బోధన్ కు బయలుదేరిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు బస్వాపూర్ గ్రామ సమీపంలోని 44 జాతీయ రహదారి సమీపంలోనికి రాగానే బస్సు డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకాలే వస్తున్న  కంటైనర్ వాహనం బస్సును ఢీ కొట్టింది .ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని అంబులెన్స్ లో మెదక్ జిల్లా రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగతా ప్రయాణికులు వేరే బస్సులు తీసుకెళ్ళారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు.